ENGLISH

బిగ్ బాస్ లో ఇక‌ నాగ్ క‌నిపించ‌డా?

05 October 2020-11:00 AM

బిగ్ బాస్ సీజ‌న్ 4 సాగుతోందిప్పుడు. నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. షోలో సెల‌బ్రెటీలు పెద్ద‌గా లేక‌పోయినా, నాగార్జున వ‌ల్ల కాస్త క్రేజ్ వ‌చ్చింది. నాగ్ వ‌ల్లే ఈ షోని కాస్త చూడ‌గ‌లుగుతున్నారు జ‌నాలు. అయితే నాగ్ ఈ షో నిర్వాహ‌కుల‌కు షాక్ ఇవ్వ‌బోతున్నాడ‌ని టాక్‌. కొన్నాళ్ల పాటు నాగ్ ఈ షోకి దూరం కానున్నాడ‌ట‌. అత‌ని స్థానంలో తాత్కాలికంగా మ‌రొక‌రు హోస్ట్ బాధ్య‌త నిర్వ‌హిస్తార్ట‌. నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `వైల్డ్ డాగ్‌`.

 

త్వ‌ర‌లో థాయ్ లాండ్‌లో కీల‌క‌మైన షెడ్యూల్ జ‌ర‌గ‌బోతోంది. క‌నీసం 20 రోజుల పాటు.. షూటింగ్ సాగ‌నుంద‌ట‌. ఈ 20 రోజులూ బిగ్ బాస్ కి డుమ్మా కొట్ట‌బోతున్నాడ‌ట నాగ్. శ‌ని, ఆది వారాల‌లో నాగ్ తెర‌పై క‌నిపిస్తాడు. అంటే దాదాపు 6 ఎపిసోడ్ల‌లో నాగ్ క‌నిపించ‌డు. ఆయా ఎపిసోడ్ల‌ని ఎవ‌రితో భ‌ర్తీ చేయాలి? అనే విష‌యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నార్ట‌. అస‌లే ఈసారి బిగ్ బాస్ పై జ‌నాల‌కు అస‌క్తి అంతంత మాత్రంగానే ఉంది. నాగ్ కూడా వెళ్లిపోతే.. క‌ష్ట‌మే మ‌రి.

ALSO READ: కొత్త కాంబో: రౌడీతో స్వీటీ..!