ENGLISH

మ‌హేష్ సినిమాకి త‌మ‌న్ త‌ల‌నొప్పి

05 October 2020-10:00 AM

టాలీవుడ్ లోని టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల‌లో త‌మ‌న్ ఒక‌డు. పెద్ద సినిమా అనేస‌రికి.. త‌మ‌న్ పేరే వినిపిస్తుంది. వ‌రుస విజ‌యాల‌తో.. త‌మ‌న్ ఇప్పుడు చెల‌రేగిపోతున్నాడు. `అల వైకుంఠ‌పుర‌ములో` ఆల్ టైమ్ హిట్స్‌లో త‌మ‌న్ పాత్ర కీల‌కం. ఇప్పుడు మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట‌`కీ త‌నే సంగీత ద‌ర్శ‌కుడు. మ‌హేష్ ఏరి కోరి త‌మ‌న్ ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ఎంచుకున్నాడు. అయితే.. ఇప్పుడు త‌మ‌నే ఈ చిత్రానికి త‌ల‌నొప్పిగా మారాడు. త్వ‌ర‌లోనే అమెరికాలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది. కొన్ని కీల‌క‌మైన సన్నివేశాల‌తో పాటు రెండు పాట‌ల్ని తెర‌కెక్కించాలి.

 

అయితే.. త‌మ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ ట్యూన్లే ఇవ్వ‌లేద‌ట‌. రెండు పాట‌ల్లో క‌నీసం త‌మ‌న్ నుంచి ఒక్క పాట కూడా రాలేద‌ని చిత్ర‌బృందం ఆందోళ‌న‌కు గురి అవుతోంది. నిజానికి తొలుత పాట‌ల్ని తెర‌కెక్కించాల‌నుకున్నారు. త‌మ‌న్ ఇంకా ట్యూన్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో, ఇప్పుడు చిత్ర‌బృందం త‌ల‌లు ప‌ట్టుకుంటోంది. అనుకున్న షెడ్యూల్ అనుకున్న‌ట్టు మొద‌ల‌వుతుందా, లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ముందుగా.. టాకీ పూర్తి చేసి, ఆ త‌ర‌వాత‌.. పాట‌లు తీసుకుందామ‌ని ప్లాన్ మార్చుకుంటున్నారు. ఇప్ప‌టికైనా త‌మ‌న్ పాట‌లు ఇస్తాడా, లేదంటే ఇలానే.. విసిగిస్తాడా..? చూడాలి మ‌రి.

ALSO READ: చరణ్‌, ఎన్టీఆర్‌ తగ్గించేసుకుంటున్నారట