ENGLISH

చరణ్‌, ఎన్టీఆర్‌ తగ్గించేసుకుంటున్నారట

04 October 2020-14:28 PM

కరోనా నేపథ్యంలో తలెత్తిన సినీ సంక్షోభంతో చాలా పెద్ద సినిమాలు గందరగోళంలో పడ్డాయి. ఇప్పటికే ప్రారంభమైన పెద్ద సినిమాలు.. తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎనిమిది నెలలపాటు షూటింగులు నిలిచిపోవడమంటే చిన్న విషయం కాదు కదా! ఈ నేపథ్యంలో నిర్మాతకు కలుగుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవడానికి హీరోలు ముందుకొస్తున్నారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం కూడా రెమ్యునరేషన్ల తగ్గింపు విషయమై సంచలన నిర్ణయం తీసుకుందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

చరణ్‌, ఎన్టీఆర్‌తోపాటు దర్శకుడు రాజమౌళి తదితరులూ రెమ్యునరేషన్‌ తగ్గించుకోవడానికి ముందుకొచ్చారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. డివివి దానయ్య ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం విదితమే. మరోపక్క, చాలాకాలంగా నిలిచిపోయిన షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి ప్రస్తుతం టెస్ట్‌ షూట్‌ కోసం రంగం సిద్ధం చేస్తున్నాడట. ఒక్కసారి షూట్‌ స్టార్ట్‌ అయితే, టీం సభ్యులెవరూ బయటకు వెళ్ళకుండా తగినన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. చాలావరకు సినిమాలు ఇప్పుడు ఇదే పద్ధతి పాటించాల్సి వస్తోంది. 2021 ప్రథమార్థంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.

ALSO READ: ఇలియానా బయోపిక్‌.. ఆమే నిర్మాత.!