ENGLISH

బిగ్ బాస్ లోకి నవదీప్?

12 August 2017-15:14 PM

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరు చర్చించుకుంటున్న అతికొన్ని విషయాల్లో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఒకటి. ఇక ఈ రియాలిటీ షో టెలివిజన్ ఛానల్స్ లోనే అత్యధిక TRPs తో దూసుకుపోతున్నది.

ఈ షో ఇప్పటికే నాలుగు వారాలని విజయవంతగా పూర్తిచేసుకుంది. ఇక ఈ రియాలిటీ షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ మధ్య మధ్యలో కొంతమందిని బిగ్ బాస్ ఇంటిలోనికి పంపిస్తుంటారు. అందులో భాగంగానే ఈ వారం ప్రముఖ హీరో అయిన నవదీప్ ని పంపుతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విషయం పై ఈరోజు రేపటి ఎపిసోడ్స్ పూర్తయితే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి వస్తున్న గాసిప్స్ నిజమై నవదీప్ బిగ్ బాస్ లోకి వస్తే ఈ షో పై జనాలకి ఇంకా ఆసక్తి పెరుగుతుంది.

కాంట్రవర్సీ హీరోగా పేరున్న నవదీప్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీలకి కేర్ అఫ్ అడ్రస్ అయిన బిగ్ బాస్ లోకి వస్తే ఏమవుతుందో అనేది వేచి చూడాల్సిందే.

 

ALSO READ: నేనే రాజు నేనే మంత్రి మొదటిరోజు కలెక్షన్స్