ENGLISH

అయ్యో నాని హీరోయిన్‌: నెటిజన్స్‌కి టార్గెట్‌ అయ్యిందే

04 January 2020-16:05 PM

నానితో 'జెంటిల్‌మెన్‌' సినిమాలో నటించిన మల్లూవుడ్‌ బ్యూటీ నివేదా థామస్‌ నెటిజన్స్‌కి అడ్డంగా దొరికిపోయింది. మ్యాటర్‌ ఏంటంటారా.? ఈ భామ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా 'దర్బార్‌'లో నటిస్తోంది. ఈ సంక్రాంతికి 'దర్బార్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా హైద్రాబాద్‌లో ఇటీవల ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై నివేదా ఆనందంతో తన ముద్దు ముద్దు మాటలు ఒలకపోసే క్రమంలో టాలీవుడ్‌లో తను స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న నాని తదితర హీరోలతో పాటు, మహేష్‌, చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల పేర్లు కూడా ప్రస్థావించింది. అయితే, వారిలో ఎన్టీఆర్‌ని మర్చిపోయిందట.

 

ఇక అంతే, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వీరంగం వేస్తున్నారు. నివేదా కెరీర్‌లో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న మొట్ట మొదటి స్టార్‌ హీరో ఎన్టీఆర్‌. ఆ సినిమా నివేదా కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్‌. అలాంటిది ఎన్టీఆర్‌ని మర్చిపోవడమేంటని గట్టిగా గడ్డి పెట్టేస్తున్నారు ఫ్యాన్స్‌. పాపం, సూపర్‌ స్టార్‌తో నటించేసరికి టాలీవుడ్‌ టైగర్‌నే మర్చిపోయిందే. అయితే, ఈ మిస్టేక్‌ని నివేదా ఎలా కవర్‌ చేసుకుంటుందో ఏమో, కానీ, ఈలోగా ఆమె తాట తీసి వదిలిపెడుతున్నారు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు. ప్రస్తుతం తెలుగులో నివేదా 'వి' చిత్రంలో మళ్లీ నానితో జత కడుతోంది. దీంతో పాటు, నిఖిల్‌ సరసన 'శ్వాస' సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది.

ALSO READ: ప్లస్‌, మైనస్‌ ఏదైనా ఒకటే.. అంటోన్న రష్మిక!