ఏపీ అసెంబ్లీ పర్వంలో జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ టీడీపీ అభిమానులకు రుచించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు, ఆనంతరం చంద్రబాబు కంటతడి ఘట్టం.. తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనత్తకు జరిగిన అవమానంపై స్పందిస్తూ తారక్ ఒక వీడియో విడుదల చేశారు. అయితే ఈ వీడియో స్పందనపై టీడీపీ శ్రేణులు పెదవి విరిచాయి. తారక్ 'ఖబడ్దార్' అని వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి ప్రవచనాలు చెప్పారని, ఇది తారక్ నుంచి ఆశించిన స్పందన కాదని విమర్శలు చేశారు.
అయితే తారక్ ని విమర్శించడం తాజాగా ఆయన ఫ్యాన్స్ ధర్నాకి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ కి సపోర్ట్ గా నిరసన తెలిపారు. తమ అభిమాన నటుడు ఎన్టీఆర్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ అభిమానులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం... బాబులకే బాబు తారక్ బాబు అంటూ అభిమానులు నినాదాలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
నిరసన వరకూ బాగానే వుంది కానీ.. 'సీఎం ఎన్టీఆర్' అని నినాదాలు ఇవ్వడం మాత్రం పరిస్థితిని హీట్ ఎక్కించాయి. కొన్ని కారణాల చేత రాజకీయాలకు దూరంగా జరిగిపోయారు తారక్. 2014, 2019 ఎన్నికల ప్రచారంలో తారక్ జాడలేదు. ఇప్పుడు కూడా రాజకీయాన్ని ప్రస్థావించడాన్ని ఇష్టపడరు తారక్. కానీ అభిమానులు సీఎం తారక్ అని నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై ఎన్టీఆర్ స్పందిస్తారా ?లేదా ? అనేది చూడాలి. ఒకవేళ ఎలాంటి స్పందన లేకుండా వదిలేస్తే మాత్రం... అభిమానులకు అదే అలావాటుగా మారి తారక్ కనిపించునప్పుడల్లా సిఎం నినాదాలు వినాల్సి వస్తుందేమో.
ALSO READ: వసూళ్లకు ఊపొచ్చింది రాజా...!