ENGLISH

ప‌వ‌న్ ఇంకా రెడీ కాలేదా?

21 October 2020-18:24 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ సెట్లోకి ఎప్పుడు అడుగుపెడ‌తాడా? చేతిలో ఉన్న సినిమాల్ని ఎప్పుడు పూర్తి చేస్తాడా? అని అభిమానులెంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క‌నీసం `వ‌కీల్ సాబ్‌` క‌బుర్లైనా వినాల‌ని క‌లలు కంటున్నారు. ఈనెల‌లోనే `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని, ఈ షెడ్యూల్ లో పవ‌న్ క‌ల్యాణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

కానీ.. ప‌వ‌న్ గెట‌ప్ చూస్తుంటే, ఆయ‌నింకా షూటింగుల‌కు సిద్ధం కాలేద‌నిపిస్తోంది. హైద‌రబాద్ వ‌ర‌ద బాధితుల‌కు కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టిస్తూ.. వవ‌న్ నుంచి ఓ వీడియో వ‌చ్చింది. ఇందులో ప‌వ‌న్ ఇంకా... పాత గెట‌ప్‌లోనే ఉన్నాడు. `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ మొద‌లవ్వ‌బోతోంద‌న్న‌ది నిజ‌మే అయితే, ప‌వ‌న్ ఈపాటికి ఆ లుక్ లోకి వ‌చ్చి ఉండాల్సింది. కానీ అదేం జ‌ర‌గ‌లేదు. ప‌రిస్థితి చూస్తుంటే, ప‌వ‌న్ కి ఇంకా సినిమాల‌కు సిద్ధం కాలేదేమో అనిపిస్తోంది. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ లుక్ లోకి రావాలంటే క‌నీసం మ‌రో వారం, ప‌ది రోజులైనా ప‌డుతుంది. అంత‌కంటే ఎక్కువ స‌మ‌యం తీసుకున్నా ఆశ్చ‌ర్చపోవాల్సిన అవ‌స‌రం లేదు. మ‌రి... వ‌కీల్ సాబ్ షూటింగ్ మాటేమిటో???