పవన్ కల్యాణ్‌కున్న క్రేజ్‌గురించి కొత్తగా చెప్పేదేముంది? తన సినిమా అంటే.. వందల కోట్ల బిజినెస్ గ్యారెంటీ. దర్శకుడు ఎవరన్నది చూడరు. పవన్ ఉంటే చాలంతే. అందుకే పవన్ సినిమా అనేసరికి... బిజినెస్ పరంగా ఎలాంటి డౌటూ అక్కర్లేదు. కాకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా, సినిమా నుంచి ఒకస్టిల్లో టీజరో బయటకు వచ్చేంత వరకూ ఆగుతాయి మార్కెట్ వర్గాలు. ఆ తరవాత.. దాని అంచనాతో.. సినిమాని కొనుక్కుంటారు. కానీ పవన్ కల్యాణ్ విషయంలోనూ ఈ థీరి రివర్స్ అయ్యింది. పవన్ సినిమా మొదలవ్వకముందే.. శాటిలైట్, డిజిటల్ డీల్ క్లోజ్ అయ్యింది.
పవన్ కల్యాణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మాత. ఈ సినిమా ఇంకా మొదలవ్వలేదు. అయితే జీ సినిమాసంస్థ శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఆ డబ్బుతోనే దాదాపు 30 శాతం పెట్టుబడి వెనక్కి వెచ్చేసినట్టు ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. `బంగార్రాజు` సినిమాకీ జీ సంస్థ అదే చేసింది. ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే కొనేసింది. ఆ డబ్బుతోనే... షూటింగ్ పూర్తి చేశాడు నాగార్జున. ఇప్పుడు పవన్ కల్యాణ్ సినిమాకీ ఇదే రూల్ పాటించింది జీ. నిజంగా.. టాలీవుడ్ లో ఇదో కొత్త సంప్రదాయం అనే చెప్పాలి.
ALSO READ: రాఘవేంద్రరావు.. సూటిగా సుత్తిలేకుండా