ENGLISH

పూజా హెగ్దే ఎందుకిలా చేశావ్‌?

07 January 2020-13:00 PM

ముద్దుగుమ్మ పూజాహెగ్దే 'అల వైకుంఠపురములో..' మ్యూజిక్‌ కాన్‌సర్ట్‌కి హ్యాండిచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకు రాలేదంటూ నిలదీస్తున్నారు. ప్రజెంట్‌ పూజా హెగ్దే సౌత్‌ సినిమాలతో పాటు, నార్త్‌ మూవీస్‌తోనూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ నిమిత్తం విదేశాల్లో ఉన్న కారణంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోతోంది. అయితే, వీలు లేని సందర్భంలో ఓ వీడియో బైట్‌ రిలీజ్‌ చేసి కూడా టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పొచ్చు. కానీ, అలాంటి లైవ్‌ వీడియో ఏదీ పూజా నుండి పోస్ట్‌ కాలేదు. ఫ్యాన్స్‌ కూడా అదే చెబుతున్నారు ఓ వీడియో పోస్ట్‌ చేసినా బావుండేది అని సలహా ఇస్తున్నారు.

 

అయితే, పూజా మాత్రం జస్ట్‌ ట్రైలర్‌ షేర్‌ చేసి ఊరుకుంది. దాంతో బన్నీ ఫ్యాన్స్‌ పూజాపై ఫైర్‌ అవుతున్నారు. మరి ఫ్యాన్స్‌ని కూల్‌ చేసేలా ఈ ముద్దుగుమ్మ రెస్పాండ్‌ అవుతుందేమో చూడాలి. తెలుగులో 'అల వైకుంఠపురములో..' సినిమాతో పాటు, ప్రబాస్‌తో 'జాన్‌' సినిమాలోనూ పూజా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే, ప్రస్తుతం పూజా హెగ్దే ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనడం లేదనేది ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌.

ALSO READ: 'అల..'లో బన్నీ ఎంత మంచోడో!