ENGLISH

రాశీఖన్నా - కేథరీన్‌ బోల్డ్‌ అండ్‌ హాట్‌ ఎవరు?

04 January 2020-11:00 AM

ఖచ్చితంగా బోల్డ్‌ అంటే కేథరీన్‌ అనే చెప్పేస్తాం. కానీ, రాశీఖన్నా కూడా ఏం తక్కువ కాదులెండి. ఇంతకీ వీరిద్దరి బోల్డ్‌నెస్‌ చర్చ ఇప్పుడెందుకంటారా.? మ్యాటర్‌ ఉంది. ఈ ఇద్దరూ విజయ్‌ దేవరకొండ సినిమా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లో నటిస్తున్నారు. లేటెస్ట్‌గా రిలీజ్‌ అయిన టీజర్‌లో ఈ ఇద్దరూ కనిపించారు. కానీ, రాశీఖన్నాకి టీజర్‌లో ఎక్కువ స్కోప్‌ ఇచ్చారు. టీజర్‌ స్టార్టింగ్‌లో టాప్‌ లెస్‌ బ్యాక్‌ వ్యూ చూపించారు. ఆ వ్యూలో ఉన్నది ఎవరు.? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. టీజర్‌ మధ్యలో రాశీఖన్నాతో విజయ్‌కి లిప్‌లాక్‌ ఉంది.

టీజర్‌ మొత్తం రాశీఖన్నా బోల్డ్‌గానే కనిపించింది. అంటే, ఈ సినిమాలో రాశీ పాత్ర అంత బోల్డ్‌గా ఉండబోతోందా.? ఇకపోతే, మరో హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ని పర్‌ఫామెన్స్‌ బేస్‌లో సాంప్రదాయమైన గృహిణి పాత్రలో చూపించారు. ఇసాబెల్లె జస్ట్‌ అలా వచ్చి వెళ్లిపోయింది. ఇక మిగిలిన కేథరీన్‌ కూడా జస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చిందంతే. కానీ, ఏ సినిమాలో ఉన్నా, నిడివి తక్కువే అయినా, కేథరీన్‌ హాట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పాపం పాప ఎక్కడా మొహమాటపడదు. అందాల విందుకు ఎన్నడూ వెనుకాడదు.

 

స్టైలిష్‌ అండ్‌ పోర్ష్‌ లుక్స్‌లో చూపించారు ఈ సినిమాలోనూ కేథరీన్‌ని. సో కేథరీన్‌ క్యారెక్టర్‌ కూడా బోల్డ్‌ వేలోనే తీర్చిదిద్ది ఉంటారనిపిస్తోంది. టోటల్‌గా 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'లో రాశీఖన్నా అంద చందాలకు డైరెక్టర్‌ కూసింత ఎక్కువే పదును పెట్టాడంటున్నారు. ఇటీవలే ఏంజల్‌ ఆర్న పాత్రతో 'ప్రతిరోజూ పండగే' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చి రాశీఖన్నా సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టేసింది. ఇక వచ్చే నెల్లో రానున్న రౌడీ మూవీ కూడా సక్సెస్‌ కొడితే, రాశీకి పండగే పండగ.

ALSO READ: 'అల వైకుంఠపురములో..' నుండి టైటిల్‌ సాంగ్‌!