ENGLISH

మళ్ళీ ఒకసారి గొంతు సవరించుకున్న రాశి

12 August 2017-19:20 PM

రాశి ఖన్నా- మంచి అభినయం ప్రదర్శించే నటీమనే కాకుండా మంచి నేపధ్యగాయని గా కూడా పేరు సంపాదించుకుంది. ఇప్పటికే తన చిత్రంలో స్వంతంగా పాట పాడుకున్న రాశి ఇప్పుడు వేరే వాళ్ళు నటించే చిత్రంలో కూడా ఒక పాట పాడింది.

వివరాల్లోకి వెళితే, నారా రోహిత్ హీరోగా బాలకృష్ణుడు అనే చిత్రంలో ఒక పాటని రాశి ఖన్నా ఆలపించందట!ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించగా, ఆయన సంగీత దర్శకత్వంలో పాట పాడే అవకాశం సంపాదించడం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు.

పవన్ మల్లెల అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండగా, అందాల తార రెజినా హీరోయిన్ గా నటిస్తున్నది.  

 

ALSO READ: నేనే రాజు నేనే మంత్రిలో ‘ఆ’ డైలాగ్ కి అనూహ్య స్పందన