ENGLISH

రెడ్ లైట్ ఏరియాలో ర‌కుల్‌?

13 July 2020-15:06 PM

సాహ‌సోపేత‌మైన పాత్ర‌లు చేయ‌డానికి క‌థానాయిక‌లు రెడీ అంటున్నారు. బోల్డ్ పాత్ర‌లైనా స‌రే - కంటెంట్ బాగుంటే.. ధైర్యంగా చేసేస్తున్నారు. ఇక వేశ్య‌లా క‌నిపించ‌డానికి హీరోయిన్లు ఎప్పుడూ రెడీనే. త‌మ‌లోని న‌టిని కొత్త‌ర‌కంగా బ‌య‌ట‌పెట్టేఛాన్స్ అలాంటి పాత్ర‌ల‌లోనే అభిస్తుంటుంది. `వేదం`లో అనుష్క చేసింది క‌దా? ఆ పాత్ర ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు అదే బాట‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా న‌డుస్తోంద‌ని టాక్‌.

 

ముంబై రెడ్ లైట్ ఏరియాలో నివ‌సించే ఓ వేశ్య క‌థ ఆధారంగా ఓ సినిమా తెరకెక్క‌బోతోంది. ప్ర‌ముఖ నిర్మాత సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌కుల్ పేరు ప‌రిశీలిస్తున్నార్ట‌. ర‌కుల్ ఓకే అంటే ఈ ప్రాజెక్టు మొద‌లైపోయిన‌ట్టే. గ్లామ‌రెస్ రోల్స్ ఇది వ‌ర‌కు ర‌కుల్ చాలానే చేసింది. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్ర ఎదురు కాలేదు. మ‌రి ర‌కుల్ స్పంద‌న ఎలా ఉంటుందో చూడాలి.

ALSO READ: Rakul Preet Singh Hot Photoshoot