ENGLISH

సోసూసూద్ మ‌రోసారి 'హీరో' అయ్యాడు

13 July 2020-15:00 PM

వెండి తెర‌పై భ‌యంక‌ర‌మైన విల‌న్ పాత్ర‌ల‌కు ప్ర‌సిద్ధి సోనూసూద్‌. బొమ్మాళీ నిన్ను వ‌ద‌లా.. అంటే... టాలీవుడ్ మొత్తం ఉలిక్కి ప‌డింది. అలాంటి సోనూలో ఓ రియ‌ల్ హీరో ఉన్నాడ‌న్న సంగ‌తి ఈ కరోనా కాలంలో బ‌య‌ట‌ప‌డింది. వ‌ల‌స కార్మికుల విష‌యంలో సోనూ చూపించి శ్ర‌ద్ధ‌, ఇచ్చిన చేయూత‌.. మాటల్లో చెప్ప‌లేం. వ‌ల‌స కార్మికుల‌కు త‌న సొంత డ‌బ్బుల‌తో ఇళ్ల‌కు పంపించాడు. ఇప్ప‌టికీ ఏదో ఓ రూపంలో స‌హాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మ‌రోసారి రియ‌ల్ హీరో అయ్యాడు.

 

దాదాపు 400 మంది వ‌ల‌స కార్మికులకు ఆర్థిక స‌హాయం చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించాడు సోనూ. వ‌ల‌స కార్మికులు ఇళ్ల‌కు వెళ్లే స‌మ‌యంలో.. చాలామంది ర‌క‌ర‌కాల ప్ర‌మాదాల్లో చిక్కుకుని మ‌ర‌ణించారు. ఆ కుటుంబాల‌ని సోనూ ఆదుకోబోతున్నాడు. ఓ నాలుగు వంద‌ల మంది కార్మికుల వివ‌రాలు సేక‌రించి, వాళ్ల బ్యాంకు ఎకౌంట్ల నెంబ‌ర్ల‌ను శోధించి, వాళ్ల‌కు ఆర్థిక స‌హాయం చేస్తానంటున్నాడు సోనూ. అంతేకాదు.. క‌ష్టాల్లో ఉన్న ఎవ‌రైనా స‌రే, త‌న‌ని సంప్ర‌దించాల‌ని చేత‌నైనంత సాయం చేస్తాన‌ని అంటున్నాడు. వెండి తెర‌పై విల‌న్ అయినా.. కార్మికుల గుండె తెర‌పై సోనూ ఎప్ప‌టికీ హీరోనే.

ALSO READ: చ‌ర‌ణ్ - మ‌హేష్‌... ఓ సినిమా!