ENGLISH

వర్మ 'గన్స్‌ అండ్‌ థైస్‌' చూశారా?

27 May 2017-13:26 PM

రామ్‌ గోపాల్‌ వర్మ సంచలన దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. వర్మ ఏం చేసినా సంచలనమే. వర్మ నుండి ఎన్నో సంచలనాత్మక చిత్రాలు వచ్చాయి. మాఫియా బ్యాక్‌ డ్రాప్‌ అంటే వర్మకెంతో ఇష్టం. అదే కాన్సెప్ట్‌ మీద ఎన్నో సినిమాలు చేశాడు. అయినా కానీ వర్మ దాహం తీరలేదు. అప్పట్లో సంచలన విజయం సాధించిన 'శివ' సినిమా లోకల్‌ మాఫియా బ్యాక్‌ డ్రాప్‌లోనే తెరకెక్కింది. అప్పట్లో ఆ సినిమా యూత్‌ని ఎంతగానో ప్రభావితం చేసింది. అదే తరహాలో బాలీవుడ్‌లోనూ 'సర్కార్‌' వంటి సెన్సేషనల్‌ మూవీస్‌ని ఎన్నో తెరకెక్కించాడు. మాఫియాతో పాటు, వర్మ సినిమాల్లో హాట్‌ కంటెన్ట్‌ కూడా ఎక్కువే ఉంటుంది. అయితే ఇవేమీ వర్మకి తృప్తినివ్వలేదు కాబోలు. తాజాగా 'గన్‌ అండ్‌ థైస్‌' పేరిట ఓ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నాడు. నాలుగు ఎపిసోడ్లుగా రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు మరో సంచలనం అయ్యింది. మాఫియాకి మితిమీరిన శృంగారాన్ని జత చేసి ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించాడు వర్మ. దీనికి సంబంధించి దాదాపు 6 నిముషాల నిడివి ఉన్న ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎప్పటి నుండో తన మనుసులో ఉన్న దాన్ని అంతా ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా చూపిస్తున్నానని వర్మ తెలిపారు. ఈ ట్రైలర్‌ చూడడానికి చాలా ఇబ్బందికరంగానే అనిపించినప్పటికీ, దీని ద్వారా వర్మ ఏం చెప్పబోతున్నాడో తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. ఈ మధ్యనే వర్మ 'సర్కార్‌ 3' సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు.

 

ALSO READ: బిగ్ బీ ని అడ‌గ‌నే లేద‌ట‌!