ENGLISH

'రంగస్థలం' మోత మోగిపోతోంది

18 March 2018-10:00 AM

రామ్‌ చరణ్‌ - సుకుమార్‌ ఎక్స్‌పెరమెంటల్‌ మ్యాజిక్‌ 'రంగస్థలం' విడుదల దగ్గరపడుతోంది. సినిమాని ఎంత క్రియేటివ్‌గా తెరకెక్కించాడో డైరెక్టర్‌ సుకుమార్‌ అంతే క్రియేటివ్‌గా ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా ప్లాన్‌ చేయనున్నాడట. ఈరోజు విశాఖలో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. ఈ ఈవెంట్‌కి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారు. 

అంతేకాదు, ఈ ఈవెంట్‌లో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ కొన్ని ప్లాన్‌ చేశారట సుక్కు అండ్‌ టీమ్‌. అవేంటో ఈవెంట్‌లోనే చూడాలంటున్నాడు. ఇకపోతే మరో పక్క చరణ్‌ 'చిట్టిబాబు' గెటప్‌ నుండి చాక్లెట్‌ బోయ్‌ గెటప్‌లోకి మారిపోయాడు. దాదాపు సంవత్సర కాలంగా చరణ్‌ గుబురు గెడ్డం, కొంచెం బొద్దుగా ఉన్న శరీరంతోనే కనిపిస్తున్నాడు. ఇలా ఈ గెటప్‌తో సినిమా కోసమే కాకుండా, చిట్టిబాబు పాత్రలో రియల్‌ లైఫ్‌లో కూడా ఎంతగానో లీనమైపోయాడు. 

ఇకపోతే ఆ గెటప్‌ నుండి ప్యాకప్‌ అయ్యాక మొదటిసారి హైద్రాబాద్‌లో ఓ ఐటీ కంపెనీ స్పెషల్‌ ప్రోగ్రాంకి హాజరైన చరణ్‌, అక్కడి ఉద్యోగులతో 'రంగస్థలం' ముచ్చట్లు వివరిస్తూ, సినిమా అందరూ చూడాలనీ, అందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందనీ చెప్పాడు. అలాగే సోషల్‌ మీడియాలో కూడా చరణ్‌ యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఆల్రెడీ 'రంగస్థలం' ఆడియోని ఇంతగా ఆదరించి, సక్సెస్‌ చేసినందుకు ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు చెప్పాడు చరణ్‌. 

అలాగే ఎప్పుడెప్పుడు అభిమానులను మీట్‌ అవ్వాలా అని 18వ తేదీ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తున్నాను అని ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని దృష్టిలో పెట్టుకుని చరణ్‌ సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. తొలిసారిగా సమంత, చరణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నా సినిమా ఇది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: 'కిరాక్ పార్టీ' షాకింగ్ కలెక్షన్స్