ENGLISH

అఖిల్ కి హీరోయిన్ దొరికేసిందా?

13 October 2020-13:02 PM

టాలీవుడ్ లో హీరోయిన్ల స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంది. అందుకే.. ఏది సెట్ అయినా, అవ్వ‌క‌పోయినా, ముందు హీరోయిన్ ని వెదికి ప‌ట్టుకుంటే ఓ ప‌నైపోతుంద‌ని భావిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. పారితోషికం కాస్త ఎక్కువ అయినా, హీరోయిన్ దొర‌క‌డ‌మే చాలు అని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. హీరోయిన్ గురించి ఓ మాట అనేసుకుంటే, బాగుంటుంద‌ని వాళ్ల అభిప్రాయం. పైగా హీరోయిన్ సెట్ట‌యిపోతే...ఆ ప్రాజెక్టుపై ఓ అంచ‌నా మొద‌లైపోతుంది. అందుకే.. హీరోయిన్‌పైనే దృష్టి పెడుతున్నారంతా. అఖిల్ - సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో ఓ సినిమా మొద‌లు కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

 

ఈ సినిమా కోసం హీరోయిన్ ని వెదికే ప‌నిలో ఉన్నాడు సురేంద‌ర్ రెడ్డి. ఎట్ట‌కేల‌కు హీరోయిన్ ఖరారైపోయిన‌ట్టు టాలీవుడ్ టాక్‌. అఖిల్ ప‌క్క‌న క‌థానాయిక‌గా ర‌ష్మిక‌ను ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ర‌ష్మిక ఈసినిమా కోసం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసింద‌ని, ర‌ష్మిక అడిగినంత ఇవ్వ‌డానికి చిత్ర‌బృందం ఓకే చెప్పింద‌ని, అలా... ర‌ష్మిక‌ని ఖ‌రారు చేసుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌`లో న‌టిస్తున్నాడు అఖిల్. ఆ త‌ర‌వాత ప‌ట్టాలెక్కేది సూరి సినిమానే.

ALSO READ: స‌మంత నుంచి అతిథికి దిగిపోయారేంటి?