ENGLISH

రష్మికపై పూజా హెగ్దేదే కంప్లీట్‌ డామినేషన్‌?

30 December 2019-17:30 PM

రష్మిక మండన్న సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుంది. ఆమెకి అభిమానగణం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా వుంది. టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ రేసులోకి అనూహ్యంగా రష్మిక దూసుకొచ్చిన విషయం విదితమే.

 

'సరిలేరు నీకెవ్వరూ' సినిమా హిట్టయితే, ఈ రేసులో ఆమెకి పెద్ద అడ్వాంటేజ్‌ అవుతుందది. మరోపక్క, పూజా హెగ్దే ఈ రేసులో రష్మిక కంటే ముందుంది. 'అల వైకుంఠపురములో' ప్రమోషన్స్‌ విషయంలో పూజా హెగ్దే చాలా ప్లాన్డ్‌గా వ్యవహరిస్తున్నట్టుంది. ఆ మాటకొస్తే, రష్మిక 'సరిలేరు నీకెవ్వరు' ప్రమోషన్స్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తున్నా, సింపుల్‌గానే పూజ, రష్మికని డామినేట్‌ చేస్తుండడం గమనార్హం. పూజా హెగ్దేదో పోల్చితే, రష్మిక కాస్త వీక్‌ గ్లామర్‌ యాంగిల్‌లో.

 

అఫ్‌కోర్స్‌, రష్మిక కూడా 'గ్లామర్‌కి సై' అనేస్తే, ఆ తర్వాత పోటీ ఇంకోలా వుంటుంది. అన్నట్టు 'సరిలేరు నీకెవ్వరు' కోసం రష్మిక కొన్ని బౌండరీస్‌ దాటేసిందని అంటున్నారు. అదే నిజమైతే, సంక్రాంతి పోటీ చాలా హాట్‌గా వుండబోతోందన్నది నిర్వివాదాంశం. ఇక, 'అల వైకుంఠపురములో' సాంగ్స్‌ని, 'సరిలేరు నీకెవ్వరు' సాంగ్స్‌నీ కంపేర్‌ చేస్తే, పూజా హెగ్దేకే అడ్వాంటేజ్‌ ఎక్కువని ఇప్పటిదాకా విడుదలవుతున్న ప్రోమోస్‌, లిరికల్‌ సాంగ్‌ వీడియోస్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

ALSO READ: Rashmika Mandanna Photoshoot