రవితేజ తాజా చిత్రం 'డిస్కో రాజా' విడుదలకు ముందు భారీ హైప్‌ని సొంతం చేసుకుంటోంది. రవితేజ అంటేనే మాస్ మహరాజ్.. ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్. ఆ ఎనర్జీ, 'డిస్కో రాజా' ప్రోమోస్‌లో కన్పిస్తోంది. ఆడియో సింగిల్స్, వీడియో ప్రోమోస్‌తో రవితేజ, సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్న మాట వాస్తవం. తాజా ఆడియో సింగిల్ 'రం..పం..బం..' కూడా ఓ రేంజ్లో వుంది. పైగా, ఇందులో రవితేజ వాయిస్ మరో అదనపు ఆకర్షణ. ఆడియో సింగిల్‌లో రవితేజకు సంబంధించిన విజువల్స్‌ని చూసేవారికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ఆ స్థాయిలో రవితేజ ఎనర్జీని ప్రదర్శిస్తున్నాడు. అయితే, ఈ మధ్య రవితేజ వరుస ఫెయిల్యూర్స్‌ని చవిచూస్తున్నాడు.
మొన్నీమధ్యనే 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో ఫ్లాప్‌ని తన ఖాతాలో వేసుకున్నాడీ మాస్ మహరాజ్. సినిమా కోసం చెయ్యాల్సిందంతా చేస్తున్నా, కథల ఎంపికలోనే తడబడుతున్న రవితేజ, ఈసారి మాత్రం అలాంటి పొరపాటు చేయడంలేదట. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డిస్కో రాజా' తెలుగు తెరపై సరికొత్త ప్రయోగం.. అని చెబుతున్నా, 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో ఓ వింత మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు రవితేజ కన్పించినట్లే, ఈ 'డిస్కో రాజా'లో కూడా ఇంకో కొత్త మానసిక సమస్యతో బాధపడుతున్న వ్యక్తిలా నటిస్తుండడం గమనార్హం. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన అందాల భామలు పాయల్ రాజ్పుట్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ALSO READ: త్రివిక్రమ్ మనసులో ఏముందంటే?