ENGLISH

రాహుల్ గాంధీ కి చురక వేసిన ప్రముఖ నటుడు!

13 September 2017-19:05 PM

హిందీ చలనచిత్ర పరిశ్రమలో కపూర్ వంశానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, ఆ సినీ పరిశ్రమలో ఎక్కువ కాలంగా ఇండస్ట్రీలో ఉన్న కుటుంబంగా వారికి పేరు ఉంది.

ఇక ఆ వంశం నుండి వచ్చిన మూడో తరం నటుడైన రిషి కపూర్ చాలా నిర్మొహమాటంగా చెప్పేసే వ్యక్తిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇక తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా తాను అనుకున్నది అనుకున్నట్టుగా ఎటువంటి సెన్సార్ లేకుండా ఎవరిపైనైనా కామెంట్స్ చేసేస్తుంటాడు.

 

తాజాగా ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ గుప్పించాడు. రాహుల్ అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో వారసత్వ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలని తప్పుపడుతూ ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

 

అయితే రిషి కపూర్ ఇటువంటి ట్వీట్స్ చేసేసరికి ఒక్కసారిగా అందరు షాక్ కి గురయ్యారు.

 

ALSO READ: ఆసుపత్రిలో అర్జున్ రెడ్డి హీరోయిన్