ENGLISH

సూపర్‌ స్టార్‌ బాటలో రౌడీ స్టార్‌.!

02 January 2020-09:30 AM

సినిమాలతో పాటు, సెలబ్రిటీలకు అదనపు వ్యాపకాలు కూడా ఉండడం సహజమే. అయితే, ఆ బిజినెస్‌లో టాప్‌ లెవల్‌ ఇంతవరకూ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుదే. అయితే, ఆయన బాటలోనే మన రౌడీస్టార్‌ విజయ్‌ దేవరకొండ కూడా చేరిపోనున్నాడు. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ అంటే, హీరో కాదు. ఓ బ్రాండ్‌ అన్నట్లుగా మారిపోయింది. విజయ్‌ వేసిన షర్టు బ్రాండ్‌. విజయ్‌ చేసిన హెయిర్‌ స్టైలే స్టైల్‌.. అన్నట్లుగా యూత్‌లో ఓ ప్రింట్‌ పడిపోయింది. అన్నట్లు మనోడు తన రౌడీ బ్రాండ్‌లో ఆల్రెడీ ఆన్‌లైన్‌లో ఓ బట్టల దుకాణం తెరిచేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక తాజాగా మరో బడా వ్యాపారంపై విజయ్‌ దేవరకొండ దృష్టి పెట్టాడు. అదే మల్టీప్లెక్స్‌ల బిజినెస్‌.

 

ప్రముఖ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి మన రౌడీ అడుగు పెట్టబోతున్నాడట. ఈ సంస్థ ఇప్పటకే మహేష్‌బాబుతో కలిసి మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా బిజినెస్‌ రన్‌ చేస్తోంది. ఇక వీరికి మన బ్రాండ్‌ బాబు విజయ్‌ దేవరకొండ కూడా తోడైతే, ఇంకేముంది ఈ సంస్థకు ప్రతిరోజూ పండగే అనాలేమో. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఎంత సంపాదించినా తన సంపాదనలో ఎంతో కొంత కష్టంలో ఉన్న వారికి సాయం చేయాలనే మనస్తత్త్వం ఉన్నోడు మన రౌడీ. ఎక్కడ కష్టం అన్న మాట వినిపించినా, తొలిసారి రెస్పాండ్‌ అయ్యే ఈ జనరేషన్‌ సెలబ్రిటీ ఎవరంటే, విజయ్‌ దేవరకొండ పేరు మొదటి వరుసలో ఉంటుంది. ఇది మాత్రం నిజం. దటీజ్‌ బంగారు కొండ విజయ్‌ దేవరకొండ. మన దేవరకొండకు కొత్త సంవత్సరం కొత్త వెలుగులు విరజిమ్మాలని ఆశిద్దాం.

ALSO READ: 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌' మూవీ రివ్యూ & రేటింగ్!