ENGLISH

సల్మాన్‌ఖాన్‌ డైరెక్షన్‌లో మెగాస్టార్‌

13 September 2017-16:52 PM

కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌, మెగాస్టార్‌ చిరంజీవికి అత్యంత ఆప్తుడు. ఆయన సలహాలు, సూచనల మేరకు మెగాస్టార్‌ చిరంజీవి ఫిట్‌నెస్‌ పాఠాల్ని అభ్యసిస్తున్నారట. 60కి పైగా వయసు కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఫిట్‌నెస్‌ పాఠించాలి చిరంజీవి. అందుకోసం ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చిరంజీవి బాడీ ఫిట్‌నెస్‌ కోసం కసరత్తులు చేస్తున్నారట. చిరంజీవి 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఫిట్‌గా కనిపించబోతున్నారు. అందుకోసం బాలీవుడ్‌ హీరో కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ సారధ్యంలో ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. 'ధృవ' సినిమా టైంలో కూడా సల్మాన్‌ఖాన్‌, చరణ్‌కి కసరత్తుల విషయంలో సూచనలిచ్చారు. అంతేకాదు, సల్మాన్‌ఖాన్‌ పర్సనల్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని చరణ్‌ కోసం నియమించాడు కూడా. అలాగే ఇప్పుడు చిరంజీవి కోసం కూడా సల్మాన్‌ ఖాన్‌ ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని నియమించారట. అలాగే డైట్‌ దగ్గర నుండీ ప్రతీ విషయంలోనూ చిరంజీవికి సల్మాన్‌ఖాన్‌ తన అపురూపమైన సలహాలు, సూచనలిస్తున్నారట. ఇవన్నీ చరణ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. చరణ్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌ కాగా, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ALSO READ: నటుడు చిన్నా ఇంట్లో విషాదం