ENGLISH

సమంత ఫాన్స్ శోభితని టార్గెట్ చేశారా?

10 August 2024-14:12 PM

తెలుగమ్మాయి అయినా శోభితకి టాలీవుడ్ లో అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు నాగ చైతన్య తో జరిగిన నిశ్చితార్ధం వలన సౌత్ మొత్తం ఫేమస్ అయిపోయింది. తెలుగులో అడవి శేష్ తో కలిసి 'గూఢచారి' సినిమాలో నటించింది. ఆ తరవాత మేజర్ లో ఒక పాత్ర చేసింది. కానీ బాలీవుడ్ లో పలు సిరీస్ లు, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. పొన్నియన్ సెల్వన్ తో  నటించటంతో సౌత్ మొత్తం పరిచయం అయ్యింది. అనుహ్యంగా అక్కినేని ఇంటి కోడలు కాబోతోంది. అసలు చైతు తో కలిసి ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు అయినా వీరు ప్రేమలో పడ్డారు. గురువారం ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యింది. పెళ్ళికి కొంచెం టైం తీసుకుంటాం అని నాగ్ ప్రకటించారు. 
 

చైతు, శోభిత ఎంగేజ్ మెంట్ న్యూస్ బయటిక్ రాగానే నెటిజన్స్ ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. కొందరు సమంత తరపున వకాల్తా పుచ్చుకుని చైతూని నిలదీసారు. మరి కొందరు శోభిత పై పడ్డారు. ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్, యాడ్స్ ప్రస్తావిస్తూ, కండోమ్ యాడ్ లో కూడా చాలా బోల్డ్ గా నటించిందని, ఆమెతో చైతూకి పెళ్లి ఏంటని హితవు చెప్తున్నారు. అంతే కాదు సమంతతో శోభితని పోల్చుతూ  దారుణంగా విమర్శిస్తున్నారు.  


నటన ఆమె వృత్తి, మనసుకి ఏది నచ్చితే అది చేసే స్వేచ్ఛ ప్రతి నటికీ ఉంటుంది. మీకు నచ్చకపోతే చూడటం మానేయండి, ఇన్నాళ్లు తప్పుకాని విషయం పెళ్లి చేసుకుని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి ప్రవేసిస్తున్నప్పుడు తప్పు అయ్యిందా అని కొందరి వాదన. శోభిత చదువులో టాప్, మోడలింగ్ లో టాప్, అందాల పోటీలలో కిరీటాలు అందుకుంది. ఒక తెలుగమ్మాయి హాలీవుడ్ స్థాయికి ఎదిగింది. అంటే ఎంత శ్రమ, పట్టుదల ఉండాలి. అవన్నీ వదిలేసి అనవసరమైన న్యూసెన్స్ ఏంటి అని చైతు ఫాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమా చూసేటప్పుడు బోల్డ్ సీన్స్ కావాలి , కానీ అందులో నటించే హీరోయిన్స్ పెళ్లి చేసుకోకూడదా? వారు పెళ్ళికి అర్హులు కారా?  అసలు చేసుకున్నవాడికి లేని ఇబ్బంది మీకెందుకు అని నిలదీస్తున్నారు.