ENGLISH

'సరిలేరు..'కు 'అల..' ఝలక్‌: నిజమేనా?

02 January 2020-11:00 AM

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ పోరు చాలా బలంగా నడుస్తోంది. మహేష్‌బాబు 'సరిలేరు..'తో అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో..' సినిమాతో బాక్సాఫీస్‌ని ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్స్‌గా మారాయి. మొదట్లో రెండు సినిమాలూ ఒకే రోజు బాక్సాఫీస్‌ని ఢీకొట్టేందుకు సిద్ధం కాగా, ధియేటర్స్‌ ఇబ్బందితో ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి, ఒక్క రోజు తేడాతో రిలీజ్‌ డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకున్నారు. అక్కడి అలా ఆ అండర్‌ స్టాండింగ్‌ సెట్టయ్యిందనుకుంటటే, ఇప్పుడు వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.

 

'అల..' టీమ్‌ రిలీజ్‌ డేట్‌ విషయంలో రీ థింకింగ్‌ చేస్తున్నట్లు తాజా సమాచారం. రెండు సినిమాల్లో మొదటిగా విడుదలవుతోన్న 'సరిలేరు..' సినిమాకి తొలి రోజు ఫుల్‌గా ధియేటర్స్‌ అవయిలబుల్‌ ఉంటాయి. సో ఓపెనింగ్స్‌కి నో ప్రాబ్లెమ్‌. కానీ, తర్వాతి రోజు రానున్న బన్నీ 'అల..'కు మాత్రం మహేష్‌ సినిమా కారణంగా భారీగా దెబ్బ పడే అవకాశాలున్నాయి. దాంతో 'అల..' టీమ్‌ మాట మార్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన రిలీజ్‌ డేట్‌ని ప్రీ పోన్‌ చేసుకోవాలనీ, అంటే, జనవరి 10నే 'అల..'ను రిలీజ్‌ చేయాలని అనుకుంటోందట. దాంతో 'సరిలేరు..'కు దెబ్బ పడే అవకాశాలున్నాయనీ సదరు నిర్మాతలు ఒప్పుకోవడం లేదనే టాక్‌.

 

ఇలా ఈ రెండు పెద్ద సినిమాల రిలీజ్‌ విషయంలో ఈ ఏడాది బాక్సాఫీస్‌ పోరు ఎలా ఉండుబోతోంతో అనే టెన్షన్‌ చిత్ర యూనిట్స్‌తో పాటు, ఫ్యాన్స్‌నీ కలవర పెడుతోంది. చూడాలి మరి, ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో.

ALSO READ: వెంకీ బ్యాలెన్స్‌ అదుర్స్‌?