ENGLISH

వెంకీ బ్యాలెన్స్‌ అదుర్స్‌?

02 January 2020-10:30 AM

స్టార్‌ హీరోలు, యంగ్‌ హీరోలు అనే తేడా లేకుండా ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించింది ముద్దుగుమ్మ ప్రియమణి. అయితే, ఆమె కెరీర్‌ ఇప్పుడు ఏమంత హైప్‌లో లేదనే చెప్పాలి. హీరోయిన్‌ అనే మాటనే మర్చిపోయారంతా. ప్రస్తుతం ఓ టీవీ ఛానెల్‌ ప్రోగ్రాంలో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడూ ఒకటీ అరా సినిమాలు చేస్తోంది. రానా - సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న 'విరాట పర్వం' సినిమాలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది ప్రియమణి. దీంతో పాటు, ఓ క్రేజీ ఆఫర్‌ ప్రియమణి తలుపు తట్టినట్లు తాజాగా ఓ న్యూస్‌ బయటికి వచ్చింది. ఇంకీ ఈ ఏంటా న్యూస్‌? అంటే, వెంకీ నటిస్తున్న 'అసురన్‌' రీమేక్‌లో ప్రియమణి హీరోయిన్‌గా ఎంపికైందట. హోమ్‌ బ్యానర్‌ అయిన సురేష్‌ ప్రొడక్షన్స్‌లో సురేష్‌ బాబు ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.

 

త్వరలో సెట్స్‌ మీదికెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గురించి సీరియస్‌గా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో శ్రియ పేరు నిన్న మొన్నటి వరకూ వినిపించగా, తాజాగా ప్రియమణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 2019లో దాదాపు ఫేడ్‌ అవుట్‌ అనుకున్న మిల్కీ బ్యూటీ తమన్నాకి 'ఎఫ్‌ 2'తో ఛాన్సిచ్చి, సరికొత్త క్రేజ్‌ తెచ్చాడు వెంకీ. ఏడాది చివర్లో వర్ధమాన హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌తో 'వెంకీ మామ'లో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేసి ఆదరగొట్టేశాడు. ఇప్పుడు వినిపిస్తున్న టాక్‌ నిజమైతే, ఫేడ్‌ అవుట్‌లో ఉన్న ప్రియమణికి కూడా వెంకీ లక్‌ కలసొచ్చి తమన్నాలా దశ తిరిగిపోతుందేమో. అయినా, వెంకీ భలేటోడండీ బాబూ, ఇటు సీనియర్‌ భామల్నీ, అటు జూనియర్‌ భామల్నీ కూడా భలే బ్యాలెన్స్‌ చేసేస్తున్నాడులే.

ALSO READ: ఆఖ‌రికి శ్రీ‌రెడ్డిని కూడా వ‌ద‌ల‌డం లేదా?