ENGLISH

మహేష్ సినిమాలో సిమ్రన్?

22 April 2024-21:41 PM

RRR లాంటి పాన్ వరల్డ్ సినిమా తరవాత రాజమౌళి నుంచి ఇంకొక సినిమా రాలేదు. జక్కన్న సినిమా అనౌన్స్ చేయటమూ ఆలస్యమే, తెరకెక్కించటం కూడా ఆలస్యమే. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అన్నీ సక్రమంగా కూర్చుకుని సినిమా అనౌన్స్ చేసి, తరవాత ఆ సినిమాని మినిమమ్ మూడేళ్లు చెక్కుతాడు. అందకే రాజమౌళి తో సినిమా అంటే ఆ హీరోని మూడేళ్లు మర్చిపోవాల్సిందే. ఇప్పడు మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తానని జక్కన్న అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై రక రకాల వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఏవి కన్ఫర్మ్ కాలేదు. వీటిపై రాజమౌళి టీమ్ ఎలాంటి స్పందన లేకుండా మౌనంగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. 


ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ జక్కన్న మహేష్ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. చాలా రోజులుగా సిమ్రన్ తెలుగు సినిమాల్లో కనిపించలేదు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్స్ అందరితో యాక్ట్ చేసింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. కొన్నాళ్ళు బ్రేక్ తీసుకుని గౌతమ్ మీనన్ సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణ లో నటించింది. మళ్ళీ గ్యాప్ వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కొన్ని  హిందీ సినిమాలు చేసింది. రీసెంట్ గా మాధవన్ తో కలిసి సిమ్రన్ నటించిన రాకెట్రి ది నంబి ఎఫెక్ట్  కి నేషనల్ అవార్డు వచ్చింది.  నెక్స్ట్ ధ్రువ నక్షత్రంలో విక్రమ్ సరసన నటిస్తోంది. చాలా ఏళ్ళ  తరవాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. 


మహేష్ బాబు సిమ్రన్ ఇద్దరు కలిసి ఇదివరకు 'యువరాజ్' సినిమాలో జోడిగా నటించారు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకి మహేష్ సినిమాలో సిమ్రన్ నటిస్తున్నారు. సిమ్రన్ క్రేజీ ఆఫర్ కొట్టేసింది అని అంతా కామెంట్స్ చేస్తున్నారు. రాజ మౌళి, మహేష్ కాంబో మూవీలో ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రంలో సిమ్రన్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించనున్నట్టు సమాచారం. ఆమే ఇందులో ఎలాంటి క్యారక్టర్ చేస్తోంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.