వేల పాటలు రాసిన సిరివెన్నెల తెలుగు పాటకు కావ్య స్థాయిని తీసుకొచ్చారు. పాటల్లో అశ్లీలం ఎక్కడా కనిపించదు. ఆ మాటకొస్తే.. ఐటెమ్ గీతంలోనూ ఎంతో కొంత భావం, స్ఫూర్తి, నేర్చుకునే లక్షణం కనిపిస్తాయి. అందుకే ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన ఇంట్లో కొలువు తీరాయి. తొలి సినిమా `సిరివెన్నెల`తోనే నంది పురస్కారం పురస్కారం అందింది. అప్పటి నుంచీ.. నంది ఆయన చుట్టమైపోయింది. ఏకంగా 11 సార్లు నందులు అందుకున్నారు. ఇన్ని నందులు అందుకున్న తెలుగు గీత రచయిత ఆయనే. వరుసగా మూడు నందులతో ఓసారి హ్యాట్రిక్ అందుకున్నారు. 1986, 1987, 1988 సంవత్సరాలుకు గానూ, వరుసగా మూడు నందులు అందుకున్నారాయన.
సిరివెన్నెల అందుకున్న నంది అవార్డులు..
1. సిరివెన్నెల (1986) - విధాత తలపున
2. శృతిలయలు (1987) - తెలవారదేమో స్వామి
3. స్వర్ణకమలం (1988) - అందెలరావమిది పదములదా
4. గాయం (1993) - సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని
5. శుభ లగ్నం (1994) - చిలక ఏ తోడు లేక
6. శ్రీకారం (1996) - మనసు కాస్త కలత పడితే
7. సింధూరం (1997) - అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే
8. ప్రేమ కథ (1999) - దేవుడు కరుణిస్తాడని
9. చక్రం (2005) - జగమంత కుటుంబం నాది
10. గమ్యం (2008) - ఎంత వరకు ఎందుకు కోరకు
11. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) - మరి అంతగా
ALSO READ: డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిన అక్కినేని హీరో