ENGLISH

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు

30 November 2021-16:21 PM

ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గత వారం అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల .. చికిత్స పొందుతూ తుది శ్వాశ విడిచారు. సిరివెన్నెల మరణ వార్త అందరినీ దిగ్బ్రాంతిని గురి చేసింది. సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతున్నారు. ఈనెల 24న ఆయన ఆస్పత్రిలో చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి వైద్యులు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొద్దిసేపటి క్రితం ఆయన తుది శ్వాస విడిచారు.

 

1986లో సిరివెన్నెల సినిమాతో పాటల రచయితగా చిత్ర రంగ ప్రవేశం చేశారు సీతారామశాస్త్రి. మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నల సీతారామశాస్త్రిగా స్థిరపడ్డారు. సీతారాశాస్త్రి కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు జాలువారాయి. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ ఆయన్ని వరిచింది. ఒక తరం సినిమా పాటకు చిరునామా నిలిచిన సిరివెన్నెల నిష్క్రమణ .. చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తెలుగు పాటకు తీరని లోటు.

ALSO READ: స‌ర్కారువారి పాట VS లైగర్‌