ENGLISH

సీతారామ‌శాస్త్రికి ఏమైంది?

28 November 2021-12:01 PM

ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి ఇప్పుడు ఆసుప‌త్రిలో చేరారు. సికింద్రాబాద్‌లోని నిమ్స్‌లో వైద్యులు ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న నిమోనియాతో బాధ ప‌డుతున్నార‌ని, ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్న‌ట్టు వైద్యులు తెలిపారు. గ‌త కొంత‌కాలంగా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అనారోగ్యంతో బాధ ప‌డుతున్నారు.

 

ఇది వ‌ర‌కు ఆయ‌న‌కు క‌రోనా కూడా సోకింది. క‌రోనా త‌ర‌వాత ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త క్షీణించింది. ఆ త‌ర‌వాత క‌రోనా నుంచి కోలుకున్నా - ఆరోగ్యం స‌హ‌రించ‌డం లేద‌ని తెలిసింది. కొంత‌కాలంగా ఆయ‌న ఆసుప‌త్రికి త‌ర‌చూవెళ్తూ, త‌గిన ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయ‌న ఆరోగ్యం మ‌రింత ఇబ్బంది క‌రంగా మార‌డంతో కుటుంబ స‌భ్యులు స్థానిక కిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి, ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు.

ALSO READ: శ్రీనువైట్లకు పితృవియోగం