ENGLISH

'అల..' సిత్తరాలు అన్నీ ఇన్నీ కావ్‌ వర్మా!

17 January 2020-10:35 AM

'అల వైకుంఠపురములో..' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి, అంచనాల్ని మించి పోజిటివ్‌ టాక్‌ అందుకుంది. సక్సెస్‌ఫుల్‌గా ధియేటర్స్‌లో రన్‌ అవుతోంది. ఈ అంచనాల నడుమ మరో సాంగ్‌ బిట్‌ని సినిమాకి యాడ్‌ చేశారు. 'సిత్తరాల సిరపడు..' అంటూ సాగే ఈ సాంగ్‌ బిట్‌ని లేటెస్ట్‌గా రిలీజ్‌ చేశారు. ఈ సాంగ్‌ ఇప్పుడు ఫ్యాన్స్‌ని ఊపు ఊపేస్తోంది. అసలే మంచి జోష్‌ మీదున్న అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌లో ఈ సాంగ్‌ మరింత ఉత్సాహం నింపింది. నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌ బిట్‌ని సినిమాలో ఎక్కడ యాడ్‌ చేస్తారా.? అనే క్యూరియాసిటీతో మళ్లీ సినిమాని చూసేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు.

త్రివిక్రమ్‌ అండ్‌ టీమ్‌ భలే తెలివిగా ప్లాన్‌ చేశారు. దీంతో 'అల..'కు రిపీటెడ్‌ ఆడియన్స్‌ పోటెత్తడం ఖాయమంటున్నారు. ఈ సాంగ్‌ బిట్‌లోని లిరిక్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో, ఏ నేపథ్యంలో ఈ బిట్‌ని యాడ్‌ చేసి ఉంటారా.? అనే క్యూరియాసిటీ నెలకొంది. మొత్తానికి 'అల..'కు 'సిత్తరాల సిరపడు..' ఓ కొత్త అలంకారమైంది. దీంతో ఈ వీకెండ్‌ కూడా 'అల..'కు ఆడియన్స్‌ పోటెత్తుతారనీ, హౌస్‌ ఫుల్స్‌ పక్కా అని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఊహించని కలెక్షన్స్‌ రాబట్టిన 'అల వైకుంఠపురములో..' తదుపరి రికార్డు దిశగా పరుగులు పెట్టనుందేమో.

ALSO READ: మహేష్‌ విషయంలో ఇది మరీ టూ మచ్‌!