ENGLISH

‘స్కైల్యాబ్‌' మూవీ రివ్యూ & రేటింగ్!

04 December 2021-13:36 PM

నటీనటులు: సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు
దర్శకత్వం : విశ్వక్ ఖండేరావు
నిర్మాతలు: నిత్యా మీనన్, ప్రవల్లిక పిన్నమరాజు, పృథ్వీ పిన్నమరాజు
సంగీత దర్శకుడు: ప్రశాంత్ విహారిసినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది
ఎడిటింగ్: రవితేజ గిరిజాల


రేటింగ్: 2.25/5


సత్యదేవ్‌, నిత్యామేనన్‌, తనికెళ్ళ భరణి, రాహుల్‌ రామకృష్ణ... వీళ్ళంతా మంచి నటులు. వీళ్ళంత ఒక సినిమాలో ప్రధాన భూమిక పోషిస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఆసక్తి ఏర్పడుతుంది. ‘స్కైల్యాబ్‌' కూడా ఇదే రకంగా ఆసక్తిని పెంచింది. ట్రైలర్ పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. కొత్త జోనర్ సినిమా అనే నమ్మకం కలిగించింది. మరి ఇంతకీ సినిమాలో ఏముంది? ఏమిటీ ‘స్కైల్యాబ్‌' కథ ?


కథ: 


1970లో బండ లింగంపల్లి గ్రామం. గౌరి (నిత్యా మీనన్) పెద్దింటి బిడ్డ. ప్రతిబింబం పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తుంది. ఆమె తన వృత్తిని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. కానీ పత్రిక మాత్రం ఆమె పెద్దింటి బిడ్డ కావడంతో భరించి ఒక దశలో ఇంక భరించిలేక ఉద్యోగం నుంచి తోలగిస్తుంది. అయితే ఎలాగైనా  ప్రతిబింబం పత్రికలో తన పేరుచూసుకోవాలనే కసితో వుంటుంది.   
ఆనంద్ (సత్యదేవ్) డాక్టర్. కానీ లైసెన్స్ రద్దు అవుతుంది. మళ్ళీ లైసెన్స్ కావాలంటే రూ. 5000 కట్టాలి. ఆ డబ్బులు ఎలా సంపాదించాలనే మార్గాలు వెదుకుతుంటాడు.


హైదరాబాద్ కంటే పల్లెటూరిలో లో డబ్బులు సంపాదించడం సులభమని వూరిలో క్లినిక్ పెడతాడు. రాము ( రాహుల్ రామకృష్ణ) సుబేదార్ కుటుంబ. పేరు గొప్ప ఊరు దిబ్బ టైపు. బోలెడన్ని అప్పులు వుంటాయి. ఆ పప్పులు ఎలా తీర్చాలా ? అనే ప్రయత్నాల్లో ఉంటాడు. ఇలా వుండగా  అమెరికా ప్రయోగించిన స్కైలాబ్‌ భూమిపై పడుతుందనే వార్త బండలింగంపల్లి గ్రామంలో దావానంలా వ్యాపిస్తుంది. అప్పుడు గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రాము జీవితాల్లో స్కైల్యాబ్‌ వార్త ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? వీరి జీవితాలు ఎలా మారాయి ? అనేది మిగతా తెరపై చూడాలి.  


విశ్లేషణ: 


ఇప్పుడు వస్తున్న దర్శకులు చిన్న కథలు పట్టుకొని పెద్ద విజయాలు సాదించేలనే టెక్నిక్ తో కథలు అల్లుకుంటున్నారు. ఒక చిన్న లైన్ వుంటే చాలు.. దాన్ని ఆసక్తికరంగా చెబితే చాలు అనే ఆలోచన వారిలో కనిపిస్తుంది. స్కై లాబ్ దర్శకుడు  విశ్వక్‌ ఖండేరావు కూడా ఇదే అలోచించాడు. 1970 నేపధ్యం తీసుకొని, స్కై లాబ్ రూమర్ ని జోడించి.. ఓ మూడు ఆసక్తికరమైన పాత్రలు సృష్టించి ఈ కథని చెప్పాలని అనుకున్నాడు. ఆలోచన బాగానే వుంది. అయితే ఆచరణ విషయానికి వచ్చేసరికి కొన్ని అడ్డంకులు వచ్చాయి. కధని బాగానే సెట్ చేశాడు దర్శకుడు. కానీ అది ప్లేయ్ అయ్యే విధానం మాత్రం సహనానికి పరీక్ష పెడుతుంది. 


పాత్రల పరిచయానికే దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా తీసుకున్నాడు. దీంతో నీరసం వచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ చూసి ఖచ్చితంగా విషయం వున్న సినిమా అనే నమ్మకానని మొదటి సగంలోనే పొగడతాడు దర్శకుడు. పాత్రల పరిచయం ఆసక్తికరంగా వున్నా,.. వాటి మధ్య ఎమోషన్ కనెక్షన్ లేకపోవడంతో తేలిపోయిన ఫీలింగ్ కలగదు. సెకండ్ హాఫ్ కి అసలు కధ మొదలౌతుంది.

 

ట్రైలర్ చూసి అద్భుతమైన కామెడీ ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుంది. సెకండ్ హాఫ్ డ్రామా అంతా సెటిల్ కామెడీతో కధని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రయత్నించాడు దర్శకుడు. కానీ కామెడీ వర్క్ అవుట్ కాలేదు.  నీరసంగా సాగే డ్రామాగానే మిలిపోతుంది. దర్శకుడు ఒక చిన్న పాయింట్ తీసుకొని కామెడీ డ్రామాగా స్కై లాబ్ ని మలచాలని భావించాడు. కామెడీ సెటప్  గానే చేసుకున్నాడు. కానీ కామెడీ పండించడం విఫలమయ్యాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బావుంది, కానీ తెరపై చూపించడం తడబాడు కనిపించింది. 


నటీనటులు : 


నిత్యామీనన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గౌరీ పాత్రలో చూడముచ్చగా కనిపించింది. సత్యదేవ్ కు కొత్త తరహా కధలు ఇష్టం. స్కై లాబ్ లో కూడా కొత్తగా కనిపించాడు. తన అనుభంతో ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.  రాహుల్ రామ కృష్ణ సెటిల్ కామెడీ చేశాడు. దాదాపు ఈ ముగ్గురే సినిమా మొత్తానికి నడిపించారు. తనికెళ్ళ భరణితో పాటు మిగతా నటీనటులు పరిధిమేర నటించారు.


టెక్నికల్ గా:


సినిమా ఆర్ట్ వర్క్ బావుంది. నేపధ్య సంగీతం బావుంది, కెమరా పనితనం చక్కగా కుదిరింది. కొన్ని చోట్ల సెటిల్ గా చేసిన కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. డైలాగ్స్ లో సహజత్వం వినిపించింది. నిర్మాణ విలువలు బావున్నాయి. 


ప్లస్ పాయింట్స్: 


నిత్యామీనన్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ 
కొత్త పాయింట్.. పల్లెటూరి నేపధ్యం 
కొన్ని కామెడీ సీన్లు


మైనస్ పాయింట్స్ 


బోరింగ్ స్క్రీన్ ప్లే 
కధనంలో వేగం లేకపోవడం 
ఆకట్టుకోలేని డ్రామా 


ఫైనల్ వర్దిక్ట్: ‘స్కైల్యాబ్‌'..  బెడిసికొట్టిన ప్రయోగం

ALSO READ: అంతా బాగానే వుంది కానీ శ్రీ‌కాంత్ ప‌రిస్థితే... దారుణం