ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఓ భాషలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోందంటే - మరో భాషలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆ సినిమాకి సహాయ పడాల్సిందే. ముఖ్యంగా డబ్బింగ్ విషయంలో. తెలుగు సినిమా బాలీవుడ్ లోకి వెళ్తే... అక్కడి స్టార్స్ తో డబ్బింగ్ చెప్పించడం, అక్కడి సినిమా ఇక్కడకు వస్తే.. ఇక్కడి హీరోలతో డబ్బింగ్ చెప్పించడం సాధారమైన విషయాలుగా మారిపోయాయి. ఇందులో భాగంగా అక్కినేని హీరో సుమంత్ కూడా డబ్బిగం్ ఆర్టిస్టుగా మారిపోయారు. `83` సినిమా కోసం.
1983లో భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ఆ ప్రయాణాన్ని 83 అనే పేరుతో సినిమాగా తీశారు. కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ నటించారు. ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయనున్నారు. అందుకే ఆ పాత్రకు సుమంత్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ - ఫాంటమ్ ఫిలిమ్స్ సమర్పణలో కబీర్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దీపికా పదుకునే - కబీర్ ఖాన్ - విష్ణు వర్ధన్ ఇందూరి - సాజిద్ నడియావాలా నిర్మించారు. కబీర్ ఖాన్ దర్శకుడు. మిగిలిన పాత్రలకు కూడా టాలీవుడ్ లో పేరున్న నటీనటులతోనే డబ్బింగ్ చెప్పించాలని అన్నపూర్ణ సంస్థ భావిస్తోంది. ఈనెల 24న ఈ చిత్రం విడుదల కానుంది.
ALSO READ: సిరివెన్నెల మరణంతో... వాయిదాల పర్వం