ENGLISH

ఫిట్‌నెస్‌ స్టూడియో ఏర్పాటు ఆలోచనలో సన్నీలియోన్‌

12 October 2020-17:24 PM

అడల్ట్‌ సినిమాలనుంచి బాలీవుడ్‌కి వచ్చి, ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై ఓ సంచలనంగా మారిన సన్నీలియోన్‌, అతి త్వరలో ముంబైలో ఓ ఫిట్‌నెస్‌ స్టూడియో ఏర్పాటు చేయబోతోందట. ఈ విషయమై ఇప్పటికే దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయని అంటున్నారు. అన్నీ కుదిరితే, ఈ ఏడాది చివర్లో ఈ స్టూడియో ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం. ఫిట్‌నెస్‌ స్టూడితోపాటు, హెల్తీ లైఫ్‌ స్టైల్‌ కోసం వివిధ రకాల ఏర్పాట్లు వుండేలా సన్నీలియోన్‌ ప్లాన్‌ చేస్తోందట. భవిష్యత్తులో దీన్నొక ‘చెయిన్‌ ఆఫ్‌ ఫిట్‌నెస్‌ బిజినెస్‌’గా మార్చాలన్నది సన్నీలియోన్‌ సంకల్పంగా కన్పిస్తోంది.

 

ప్రధానంగా యోగా, ప్రకృతి వైద్యం వంటి వాటిపై ఫోకస్‌ పెట్టేలా ఈ స్టూడియోని డిజైన్‌ చేస్తున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘బాలీవుడ్‌ సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్న మాట వాస్తవం. ఈ నేపథ్యంలో నేను బాలీవుడ్‌కి నావంతు ప్రయత్నంగా ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను..’ అని పలు సందర్భాల్లో సన్నీలియోన్‌ చెప్పింది. ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి సినిమాలు చేయాలన్న ఆలోచన కూడా సన్నీలియోన్‌కి వున్నప్పటికీ, అది ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం లేదు.

 

ఫిట్‌నెస్‌ పట్ల ఇప్పుడు అందరిలోనూ అవగాహన పెరగడంతోపాటు, ఈ రంగంలో బోల్డంత ఆదాయం వస్తుండడంతో సన్నీలియోన్‌ భలేగా ప్లాన్‌ చేస్తోందని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా వుంటే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సహా పలువురు నటీమణులు ఫిట్‌నెస్‌ స్టూడియోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ALSO READ: నాగ్ కోసం పూరి క‌థ రెడీ అయిపోయిందా?