ENGLISH

త‌మ‌న్నా డిశ్చార్జ్.. ఇప్పుడు ఇంటికే ప‌రిమితం

06 October 2020-09:20 AM

ప్ర‌ముఖ క‌థానాయిక త‌మ‌న్నా భాటియా క‌రోనా బారీన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చిన క‌రోనా తీవ్ర జ్వ‌రంతో బాధ ప‌డ‌డం, ఆ త‌ర‌వాత కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవ‌డం, క‌రోనా పాజిటీవ్ అని తేల‌డంతో హైద‌రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేర‌డం ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే. ఇప్పుడు ఆసుప‌త్రి నుంచి త‌మ‌న్నా డిశ్చార్జ్ అయ్యింది. ఈ విష‌యాన్ని త‌మ‌న్నా స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలియ‌జేసింది.

 

దుర‌దృష్ట‌వ‌శాత్తూ తాను క‌రోనా బారీన ప‌డ్డాన‌ని, ఇప్పుడు ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాయ‌న‌ని, ఇక మీదట కొన్ని రోజులు సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉంటాన‌ని త‌మ‌న్నా ప్ర‌క‌టించింది. త‌న గురించి ప్రార్థ‌న‌లు చేసిన వాళ్లంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసింది. ప్ర‌స్తుతం త‌మ‌న్నా హైద‌రాబాద్ లోనే ఉంది. మ‌రో 14 రోజుల పాటు ఇంటికే ప‌రిమితం కానుంది. త‌మ‌న్నా క‌థానాయిక‌గా `సిటీమార్‌` అనే చిత్రం తెర‌కెక్కుతోంది. ఆ సినిమా షూటింగ్ కోస‌మే త‌మ‌న్నా హైద‌రాబాద్ వ‌చ్చింది.

ALSO READ: పవన్ కల్యాణ్ తో ప్రముఖ నటులు శ్రీ సుదీప్ గారు భేటీ