టికెట్ రేట్ల విషయంలో.. నిర్మాతల నెత్తిన పిడుగు వేసింది ఏపీ ప్రభుత్వం. టికెట్ రేట్లని పెంచేది లేదని, బెనిఫిట్ షోలు లేవని, కేవలం నాలుగు షోకే ప్రదర్శించుకోవాలని - జీవో జారి చేసేసింది. ఇక నిర్మాతలు చేసేదేం లేదు. ఆ రూల్స్ ఫాలో అవ్వడం మినహా ఏం చేయలేరు. ఇది నిజంగా... పెద్ద సినిమాలకు నష్టం చేకూర్చే నిర్ణయమే. దీని ఎఫెక్ట్... డిసెంబరు, సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలపై తప్పకుండా పడబోతోంది.
ఆర్.ఆర్.ఆర్, పుష్పలాంటి సినిమాలు భారీ రేట్లకు అమ్మేశారు. అల వైకుంఠపురం చూపించి పుష్ప, బాహుబలిని చూపించి ఆర్.ఆర్.ఆర్‌ని భారీ రేట్లకు అమ్మారు. బయ్యర్లు కూడా రిటర్న్స్ భారీగా ఉంటాయని ఆశించి, పెద్ద సినిమాల్ని కొన్నారు. అయితే ఏపీలో భారీ వసూళ్లు వచ్చే ఆస్కారం లేదు. కొత్త రేట్లతో.. పెట్టుబడి దక్కించుకోవడమే గగనం అయిపోతుంది. 10 రూపాయలు రావల్సిన చోట 7 రూపాయలే వస్తే.. 3 రూపాయల నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇప్పటికే బయ్యర్లు అడ్వాన్సులు ఇచ్చి సినిమాల్ని కొన్నారు. వాళ్లంతా ఇప్పుడు నిర్మాతల ముందు నిలబడడం ఖాయం. టికెట్ రేట్లు తగ్గించిన నేపథ్యంలో, సినిమా రేట్లని కూడా తగ్గించాలని అడగడం మినహా మరో మార్గం లేదు. నిర్మాతలు పెద్ద మనసు చేసుకుని, కొంత సొమ్ము వెనక్కి ఇస్తే ఫర్వాలేదు. లేదంటే నిండా మునిగిపోయినట్టే.
ALSO READ: శివ శంకర్ మాస్టర్ కి సోనూసాయం