ENGLISH

బాక్సింగ్ బ‌రిలో దిగుతున్న వ‌రుణ్‌.

04 January 2020-11:32 AM

గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ హిట్టుతో వ‌రుణ్ తేజ్ 2019ని ఘ‌నంగానే ముగించాడు. ఇప్పుడు మ‌ళ్లీ షూటింగుల‌తో బిజీ కానున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి చెప్పిన క‌థ‌కు వ‌రుణ్ ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో వ‌రుణ్ ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అందుకోసం వ‌రుణ్ ప్ర‌స్తుం శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. ఫిబ్ర‌వ‌రి నుంచి విశాఖ‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

 

త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్‌, ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ధారులు ఎంపిక జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌తో పాటు, టైటిల్‌నీ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. బాక్సింగ్ నేప‌థ్యంలో టాలీవుడ్ లో ఇది వ‌ర‌కు కొన్ని సినిమాలొచ్చాయి. అమ్మానాన్న త‌మిళ అమ్మాయి, త‌మ్ముడు ఆ టైపు క‌థ‌లే. అయితే పూర్తిగా బాక్సింగ్ చుట్టూ తిరిగే క‌థ ఇదే అంటోంది చిత్ర‌బృందం.

ALSO READ: ఫుల్‌ జోష్‌లో రౌడీస్‌!