ENGLISH

పూరి జగన్నాధ్ కి వైద్య పరీక్షలు?

19 July 2017-18:30 PM

ఉదయం 10.30నిలకు మొదలయిన పూరి జగన్నాధ్ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.

అయితే విచారాణ సాఫీగానే సాగుతున్నది అంటూ ఇప్పటివరకు వార్తలు వచ్చినా, ఇప్పుడు ఉస్మానియా ఆసుపత్రి నుండి ఓ మెడికల్ సర్జన్ సిట్ ఆఫీస్ కి రావడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది.

దీనితో పాటుగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు దర్శకుడు పూరి జగన్నాధ్ కి బ్లడ్ టెస్ట్ చేస్తారు అని అలాగే ఆయన ఈ మధ్యకాలంలో డ్రగ్స్ తీసుకున్నాడో లేదో తెలుసుకోవడానికే ఇటువంటి టెస్ట్ చేయనున్నారు అని సమాచారం.

అయితే ఇప్పటికే ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం వీడియో కెమెరాలో చిత్రీకరిస్తుండగా, ముగ్గురు అధికారులు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకొంతమంది మాత్రం ఆయనని అరెస్ట్ చేయనున్నారు అందుకే ఆయన హెల్త్ చెకప్ కోసమే వైద్యులని పిలిపించారని కూడా పుకార్లు మొదలయ్యాయి.

క్షణక్షణానికి సిట్ ఆఫీస్ వద్ద పరిస్థితులు మారుతుండడంతో తీవ్ర ఉత్కంట నెలకొంది.

 

ALSO READ: పూరి జగన్నాధ్ సిట్ ఇన్వెస్టిగేషన్ లైవ్ అప్ డేట్స్