బుల్లి తెరపై స్టార్ హీరోలు సందడి చేయడం ఇప్పుడు మామూలైపోయింది. ఓటీటీలు వచ్చాక - వాళ్ల ప్రభావం మరింతగా కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ సైతం `అన్ స్టాపబుల్` తో ఓటీటీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న టాక్ షో ఇది. ఈ షో కోసం బాలయ్య భారీ పారితోషికాన్ని అందుకున్నట్టు సమాచారం. అయితే... దానికి తగ్గట్టుగానే `ఆహా` వ్యూవర్ షిప్ కూడా పెరిగింది. ఇప్పటి వరకూ ఈ షోకు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయట. తెలుగు ఓటీటీలో ఇదే రికార్డ్.
నిజానికి తెలుగులో కొన్ని షోలు బాగానే పాపులర్ అయ్యాయి.కానీ ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. ఆఖరికి సమంత చేసిన టాక్ షోకి సైతం.. ఇంత స్పందన లేదు. బాలయ్య వచ్చాడు...రికార్డులు బద్దలు కొట్టాడు. తెలుగులో ఓటీటీలకు ఆదరణ అంతంత మాత్రమే అనుకుంటున్న ఇలాంటి దశలో.. అన్స్టాపబుల్ లాంటి షోలు.. కాస్త ఊపిరి పోస్తున్నాయి. అన్ స్టాపబుల్ సీజన్ 1 చూసి, ఆ రిజల్ట్ బాగుంటే సీజన్ 2 కొనసాగించాలని ఆహా భావించింది. వాళ్లు ఈ రిజల్ట్ తో సంతృప్తిగానే ఉన్నారు. సో.. సీజన్ 2 రావడం దాదాపు పక్కా అయిపోయినట్టే.
ALSO READ: సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరు