ఈరోజు అఖండ విడుదలైంది. బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగాఉన్నాయి. ట్రైలర్, పాటలూ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఆశలు మరింత పెరిగాయి. దానికి తగ్గట్టే ఈ రోజు మంచి టాక్ వచ్చింది. మాస్ సినిమా అని, ఫ్యాన్స్‌సినిమా అని విశ్లేషకులు తీర్పు ఇచ్చేస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ కి నచ్చేలా ఈ సినిమాని బోయపాటి శ్రీను తీశాడని మెచ్చుకుంటున్నారు.
అయితే ఓ సీన్ దగ్గర చిక్కొచ్చిపడింది. శ్రీకాంత్ లోని విలనిజాన్ని భీకరంగా చూపించే ప్రయత్నంలో బోయపాటి హద్దు దాటాడు. పూర్ణని రేప్ చేసే సీన్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నిజానికి రేప్ సీన్లు చాలా కామన్. కాకపోతే.. ఈ సీన్‌లో ఆరేళ్ల కొడుకు ముందు తల్లిని రేప్ చేయడం.. చాలా ఓవర్ ది బోర్డ్ లా కనిపిస్తుంది. అలాంటి సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం, భరించడం కష్టం. ఎంత ఊర మాస్ అయినా, విలన్ ని ఎంత హైలో చూపించాలన్నా.. ఇలాంటి సీన్లు అవసరమా? అనిపిస్తుంది. ఆ ఊహ.. బోయపాటికి ఎలా వచ్చిందో? శ్రీకాంత్ ఎలా ఒప్పుకున్నాడో? అనే డౌటు వస్తుంది. ఆరేళ్ల పిల్లాడి తలమీద సుత్తితో కొట్టి.. తద్వారా తల్లిని భయపెట్టాలని చూడడం విలనిజంలోని మరో కోణం. విలనిజం చూపించడానికి చాలా మార్గాలున్నాయి. బోయపాటి ఇలాంటి దారిలో ఎందుకు వెళ్లాడో..?
ALSO READ: 'అఖండ' మూవీ రివ్యూ& రేటింగ్