ENGLISH

ఈ వారం బిగ్ బాస్ నుండి వెళ్ళిపోయేది సునైనా?

19 August 2018-12:38 PM

బిగ్ బాస్ సీజన్ 2లో ప్రతివారం గడుస్తున్న కొద్ది ఇంటిలోని సభ్యులతో ఒకరికొకరు ఎంతలా దగ్గరవుతున్నారో షో చూస్తున్న వారు కూడా అంతే స్థాయిలో వారితో కనెక్ట్ అవుతున్నారు.

ఇక ఎప్పుడైతే ఆదివారం ఇంటినుండి ఎవరో ఒకరు వెళ్ళిపోవాల్సి వస్తుందో అప్పుడు ఇంటిలోని వారు షో చూస్తున్నవారు బాధపడుతున్న అంశం మనం గమనించవచ్చు. అలానే ఈ వారం కూడా ఎలిమినేషన్ సమయానికి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉంది.

అయితే ఇప్పటికే గీత, శ్యామల ఎలిమినేషన్ నుండి సురక్షితులు కాగా పూజ, దీప్తి సునైనా, రోల్ రైడా ఇప్పటికే డేంజర్ జోన్ లో ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఈరోజు ఇంటి నుండి నిష్క్రమించనున్నారు. దీన్నిబట్టి ఈ ముగ్గురిలో కాస్త వెనుకబడి ఉన్నది దీప్తి సునైనా అని చెప్పొచ్చు.

అందుకనే దాదాపుగా ఇంటి నుండి నిష్క్రమించేది దీప్తి సునైనా అని ఎక్కుమంది అభిప్రాయపడుతున్నారు. చూద్దాం.. ఇదే జరుగుతుందా లేక మరేదైనా ట్విస్ట్ ఉంటుందా అనేది..

 

ALSO READ: బిగ్‌బాస్‌ మీద బుక్‌ రాస్తానంటోన్న బిగ్గర్‌ బాస్‌.!