ఈ యేడాది విడుదలైన ఉత్తమ చిత్రాల్లో `జై భీమ్` ఒకటి. ఈ యేడాదేంటి? ఈ దశాబ్దంలోనే ఇలాంటి సినిమా రాలేదంటూ విశ్లేషకులు కితాబిస్తున్నారు. ఆ సినిమాకి అంతటి అర్హత ఉంది. సూర్య - జ్ఞానవేల్ చేసిన ఈ ప్రయత్నం చిత్రసీమనంతటినీ కదిలించింది. ఈ సినిమాకి మంచి రివ్యూలొచ్చాయి. దేశమంతా చర్చకు దారి తీసింది. ఈ యేడాది అవార్డుల్లో సింహ భాగం జై భీమ్‌కే అన్నది విశ్లేషకులు మాట.
ఇప్పుడు జై భీమ్ ఖాతాలో మరో ఘనత చేరింది. జై భీమ్.. విదేశీ చిత్రం కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారానికి నామినేట్ అయింది. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్ వేదికగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ని అందించనున్నారు. ఇక అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో ఆస్కార్ అవార్డ్స్ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ అవార్డు దక్కడం మామూలు విషయం కాదు. అసలు నామినేట్ అవ్వడమే ఓ అదృష్టంగా, పురస్కారంగా భావిస్తారు. జై భీమ్‌కి ఆ గౌరవం దక్కింది. ఇక జ్యూరీ మనసుల్నీ గెలుచుకుంటే గ్లోల్డెన్ గ్లోబ్ దక్కించుకున్నట్టే.
ALSO READ: పదకొండు నందులు అందుకున్న ఒకే ఒక్కడు