ENGLISH

ఇక నైనా వేణు స్వామి మారతాడా?

13 August 2024-13:09 PM

ఎవరైనా పెళ్లి చేసుకుంటామని చెప్పగానే సంతోషంగా ఉండండి అంటూ దీవిస్తారు కానీ వేణు స్వామి మాత్రం వీళ్ళు ఎన్నాళ్లు కలిసి ఉండరు విడిపోతారని పని గట్టుకుని మరీ ప్రచారం చేస్తూ ఉంటాడు. కనీసం ఈ మాటలకి వాళ్ళు బాధపడతారని, ఫ్యామిలీ కంగారు పడుతుందని  ఆలోచించడు. తాను ఎదో ఒక లాగా ఫేమస్ అయితే చాలు. ట్రెండింగ్ లోకి రావటానికి ఎలాంటి అవాకులు చెవాకులు అయినా చెప్తాడు. వేణు స్వామి వ్యవహారంతో చాలా మంది విసిగిపోయారు. కనిపిస్తే దేహశుద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకయ్యా స్వామి నీకిలాంటి బుద్ధి, శాస్త్రం తెలిసిన ఆ నోటితో అపశకునం పలకకుండా శుభం మాట్లాడొచ్చు కదా అని పలువురు చీవాట్లు పెడుతున్నారు. 


రీసెంట్ గా నాగ చైతన్య, శోభిత నిశ్చితార్ధ వేడుక జరిగింది. నాగార్జున ఎంతో సంతోషంగా కొత్త జంట గూర్చి అనౌన్స్ చేసాడు. అదే రోజు సాయంత్రానికి వేణు స్వామి రెడీ అయిపోయాడు. ఎవరైనా అడిగారా అతన్ని వారి జాతకాలూ, పెళ్లి గూర్చి. అసలెందుకు విడాకులు గూర్చి మాట్లాడటం అదేం శునకానందం అని అంతా తిట్టుకున్నారు. అక్కినేని ఫాన్స్  వేణు స్వామికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈలోగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణుస్వామి పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. మహిళా కమిషన్‌కు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు.  


వేణు స్వామి బిగ్ బాస్ సీజన్ 8 కి కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగుపెడుతున్నాడని ప్రచారం జరుగుతున్న టైంలో, ఇప్పుడు ఈ వివాదంతో వేణు స్వామిని హౌస్ లోకి తీసుకోవటానికి నాగ్ ఒప్పుకుంటారా ? అన్న సందేహాలు కూడా మొదలయ్యాయి.