ENGLISH

బాల‌య్య అంటే.. ఈసారైనా ఒప్పుకుంటుందా?

04 December 2021-11:00 AM

నంద‌మూరి బాల‌కృష్ణ తో సినిమా అంటే.. ఒక‌టే స‌మ‌స్య‌. ఆయ‌న‌కు స‌రైన క‌థానాయిక‌ని ప‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. బాల‌య్య ప‌క్క‌న యంగ్ హీరోయిన్లు స‌రిపోరు. సీనియ‌ర్ క‌థానాయిక‌లు అందుబాటులో ఉండ‌రు. స్టార్లూ... బిజీనే. అందుకే.. బాల‌య్య సినిమాలో హీరోయిన్ ఎంపిక పెద్ద స‌మ‌స్య‌గా మారిపోతుంటుంది. ఈసారి మాత్రం అలాంటి ఇబ్బందేం లేకుండా, ముందే క‌థానాయిక‌ని ఫిక్స్ చేసుకోవాల‌నుకుంటున్నాడు అనిల్ రావిపూడి.

 

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అనిల్ రావిపూడి స్క్రిప్టుని రెడీ చేసేశాడు. సంక్రాంతి త‌ర‌వాత ఈ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా.. హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ప‌డ్డాడు. రావిపూడి మైండ్ లో ఉన్న నాయిక‌.. త‌మ‌న్నా. ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య - త‌మ‌న్నా కాంబో సెట్ కాలేదు. గ‌తంలో ఓసారి ఇలాంటి ఆఫ‌ర్ వ‌స్తే.. త‌మ‌న్నా ఒప్పుకోలేదు. మ‌రి ఈసారైనా ఒప్పుకుంటుందా, లేదా? అనేదే అనుమానం. అనిల్ రావిపూడికీ, త‌మ‌న్నాకు మంచి అనుబంధం ఉంది. ఎఫ్ 2, ఎఫ్ 3ల‌లో త‌నే హీరోయిన్‌. స‌రిలేరు నీకెవ్వ‌రులో ఐటెమ్ సాంగ్ కూడా చేసింది. అందుకే త‌మ‌న్నాని రావిపూడి రిపీట్ చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌. మరి ఏం జ‌రుగుతుందో చూడాలి.

ALSO READ: నాగ‌బాబుకి త‌గ్గ‌ని క్రేజ్‌... భారీ పారితోషికం