ENGLISH

'ప‌వ‌ర్ స్టార్‌'లో త్రివిక్ర‌మ్‌?

13 July 2020-12:00 PM

వ‌ర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. సినిమా చిన్న‌దే. కానీ.. అది రేపుతున్న సంచ‌ల‌నాలు మాత్రం చాలా పెద్ద‌వి. పోస్ట‌రు, టైటిల్‌తో ప‌వ‌న్ ఫ్యాన్స్ లో గుబులు పుట్టించాడు వ‌ర్మ‌. ప‌వ‌న్ తో పాటుగా ఈ సినిమాలో చాలామంది ప్ర‌ముఖుల ప్ర‌స్తావ‌న ఉండ‌బోతోంది. చిరంజీవి ని పోలిన పాత్ర కూడా ఉంద‌ని పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మవుతుంది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ నీ చూపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

 

ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఉన్న అనుబంధం ప్ర‌త్యేక‌మైన‌ది. ఇద్ద‌రూ మంచి మిత్రులు. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌మ‌యంలో ప‌వ‌న్‌కి త్రివిక్ర‌మ్ స్పీచులు రాసిచ్చాడ‌ని జ‌నం అప్ప‌ట్లో చెప్పుకున్నారు. వీటిపై త్రివిక్ర‌మ్, ప‌వ‌న్ సైతం వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. కానీ.. ఇప్పుడు అదే విష‌యాన్ని వ‌ర్మ సెటైరిక‌ల్ గా చూపించ‌బోతున్న‌ట్టు టాక్‌. త్రివిక్ర‌మ్ అనే కాదు. ప‌వ‌న్ తో అనుబంధం ఉన్న చాలా పాత్ర‌ల్ని వ‌ర్మ తెర‌పై కి తీసుకురాబోతున్నాడ‌ట‌. మ‌రి ఎవ‌రెవ‌రి పాత్ర‌ల్ని వ‌ర్మ ఎలా చూపింబ‌చోతున్నాడు అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ: క‌లెక్ట‌ర్ గారొస్తున్నారు!