ఒకప్పుడు... వినాయక్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. రాజమౌళితో పాటు సరిసమానమైన క్రేజ్‌లో ఉండేవాడు. అయితే...కొన్నాళ్లుగా వినాయక్ నుంచి సినిమారాలేదు. ఆయనకూ సినిమాలపై ఆసక్తి తగ్గిందన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. `ఛత్రపతి` హిందీ రీమేక్‌తో వినాయక్ మళ్లీ ట్రాక్ ఎక్కారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా తరవాత... ఎలాంటి కథతో రావాలన్న విషయంపైనా వినాయక్ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఈసారి ఆయన ఓ రియల్ స్టోరీపై దృష్టి పెట్టార్ట. కర్నూలు లో జరిగిన ఓ ఫ్యాక్షన్ గొడవ చుట్టూ ఈ కథ నడవబోతోందని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం రైటర్స్టీమ్ తో ఈ కర్నూలు ఫ్యాక్షన్ కథని రాయిస్తున్నాడట వినాయక్. ఛత్రపతి అయిపోగానే... ఓ పెద్ద హీరోతో ఈప్రాజెక్టు పట్టాలెక్కించాలన్నది వినాయక్ ప్లాన్. వినాయక్ చేసినవన్నీకమర్షియల్ సినిమాలే. ఆయనెప్పుడూ... రియల్ స్టోరీలవైపు దృష్టి సారించలేదు. కాకపోతే...ఫ్యాక్షన్ కథల్ని తెరకెక్కించడంలో వినాయక్ సిద్ధహస్తుడు. అందుకే మళ్లీ తన జోనర్లోకి వెళ్లాలనుకుంటున్నాడు. గతంలో బాలకృష్ణ - వినాయక్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందని ప్రచారం జరిగింది. కానీ అది కుదర్లేదు. ఈసారి వినాయక్ తయారు చేసుకుంటున్న ఈ కథ... బాలయ్య కోసమేమో చూడాలి.
ALSO READ: అఖండ కోసం వస్తున్న ఐకాన్ స్టార్