సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాదిగా సినిమాలకి బ్రేకిచ్చిన సంగతి తెలిసిందే. ఇపుడు మళ్ళీ రీ ఎంట్రీకి సిద్దమయ్యింది. త్వరలో సామ్ నటించిన 'హానీ బనీ' వెబ్ సిరీస్ తో అలరించేందుకు రెడీగా ఉంది. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. విజయ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకి సామ్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. సమంత యాక్షన్ సీన్స్ లో విజృభించిందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
వరుణ్ ధావన్ తో కలిసి నటించిన ఈ సిరీస్ కి సామ్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. సౌత్ లో సామ్ పేమెంట్ ఇప్పటివరకు 3 నుంచి 5 కోట్లు ఉండగా, హనీ బనీ కోసం ఏకంగా ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని బాలీవుడ్ మీడియా సమాచారం. దీనితో ఇప్పటివరకు బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న సౌత్ హీరోయిన్ గా సామ్ రికార్డ్ సాధించింది. సౌత్ లోనే సామ్ కంటే చాలా మంది ముందు ఉన్నారు. దక్షిణాదిన నయనతార హైయెస్ట్ పైడ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. లేటెస్ట్ గా త్రిష నయన్ రికార్డ్ ని బ్రేక్ చేసింది.
నయనతార ఈ మధ్య ఒక్కో సినిమాకి 10 కోట్లు తీసుకుంటుండగా, త్రిష విశ్వంభర మూవీకి 13 కోట్లు డిమాండ్ తో రికార్డ్ కెక్కింది. అలాంటిది సౌత్ లోనే ఎక్కువ పేమెంట్ లేని సమంత బాలీవుడ్ లో ఒక సిరీస్ కోసం 10 కోట్లు తీసుకోవటం గమనార్హం. జవాన్ సినిమాకి నయన్ తార 8 నుంచి 10 కోట్ల పేమెంట్ తీసుకుందని టాక్. ఇప్పుడు సమంత హనీ బనీ కోసం 10 కోట్లు తీసుకుని, నయన్ రికార్డ్ కొల్లగొట్టింది.